రౌత్ ఇంట్లో డిన్నర్ పార్టీ... బీజేపీకీ అందిన ఆహ్వానం

ABN , First Publish Date - 2021-03-24T19:16:17+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ

రౌత్ ఇంట్లో డిన్నర్ పార్టీ... బీజేపీకీ అందిన ఆహ్వానం

ముంబై : మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ మహావికాస్ అగాఢీని ఇరుకున పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ముంబై మాజీ సీపీ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఉద్ధవ్ సర్కార్ గిలగిలా కొట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో శివసేన ‘విందు రాజకీయా’నికి తెర లేపింది. ఈ విందు రాజకీయం ద్వారా అటు బీజేపీని, ఇటు రాష్ట్రాన్ని చల్లబర్చాలని ప్రయత్నాలు చేస్తోంది. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం తన స్వగృహంలో ఓ డిన్నర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కు మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానాలు వెళ్తాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనకు చెందిన ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారు. ఇక... ప్రతిపక్షమైన బీజేపీకి కూడా ఈ ఆహ్వానం అందడం విశేషం. అయితే హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్న బీజేపీ.... రౌత్ ఆహ్వానించిన డిన్నర్ పార్టీకి హాజరవుతుండటం గమనార్హం.

Updated Date - 2021-03-24T19:16:17+05:30 IST