అత్యంత కాలుష్య నగరాల్లో మూడోవంతు భారత్‌లోనే!

ABN , First Publish Date - 2021-03-17T07:36:29+05:30 IST

ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో మూడోవంతు భారత్‌లోనే ఉన్నాయి. స్విస్‌ సంస్థ ఐక్యూఎయిర్‌ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం

అత్యంత కాలుష్య నగరాల్లో మూడోవంతు భారత్‌లోనే!

అధిక కాలుష్య రాజధాని నగరాల్లో ఢిల్లీ టాప్‌

స్విస్‌ సంస్థ ఐక్యూఎయిర్‌ అధ్యయనంలో వెల్లడి


న్యూఢిల్లీ, మార్చి 16 : ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో మూడోవంతు భారత్‌లోనే ఉన్నాయి. స్విస్‌ సంస్థ ఐక్యూఎయిర్‌ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం ఎక్కువగా ఉన్న 30 నగరాల్లో 22 నగరాలు భారత దేశంలోనే ఉన్నాయని ‘వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌-2020’ తేల్చింది. అందునా వాయుకాలుష్యం అధికంగా ఉన్న రాజధాని నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. అయితే 2019 నుంచి 2020 మధ్య కాలంలో ఢిల్లీలో గాలి నాణ్యత 15 శాతం మెరుగుపడిందని నివేదిక తేల్చింది. వాయు నాణ్యతా ప్రమాణాలు మెరుగైనప్పటికీ.. అధిక కాలుష్య నగరాల్లో ఢిల్లీ పదో స్థానంలో, రాజధాని నగరాల్లో అగ్రభాగాన నిలిచింది.


ఢిల్లీతో పాటు ఘజియాబాద్‌, బులంద్‌షహర్‌, బిస్రక్‌ జలాల్‌పూర్‌, నోయిడా, కాన్పూర్‌, లఖ్‌నవూ, మేరఠ్‌, ఆగ్రా, ముజఫర్‌పూర్‌(ఉత్తరప్రదేశ్‌), భివారీ(రాజస్థాన్‌), ఫరీదాబాద్‌, హిసార్‌, ఫత్తేబాద్‌, భండ్వారీ, గురుగ్రామ్‌, యమునానగర్‌, రోహ్‌తక్‌, ధరుహెరా(హరియాణా), ముజఫర్‌పూర్‌(బిహార్‌) కూడా కాలుష్య నగరాల జాబితాలో ఉన్నాయి. దేశంలోని 9 నగరాల తర్వాత చైనాలోని షిన్‌జియాంగ్‌ అఽధిక కాలుష్యమున్న నగరంగా నిలిచింది. రవాణా, వంటచెరకు వినియోగం, విద్యుదుత్పత్తి, పరిశ్రమలు, నిర్మాణరంగం, వ్యవసాయ వ్యర్థాల దహనం తదితరమైనవి దేశంలో వాయుకాలుష్యం పెరగడానికి ప్రధాన కారణాలని అధ్యయనంలో వెల్లడైంది. 

Updated Date - 2021-03-17T07:36:29+05:30 IST