Delhi: కరోనా నియమాల ఉల్లంఘన... మరో రెండు మార్కెట్ల మూసివేత!

ABN , First Publish Date - 2021-07-14T13:11:38+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గడంతో

Delhi: కరోనా నియమాల ఉల్లంఘన... మరో రెండు మార్కెట్ల మూసివేత!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గడంతో ఇప్పటివరకూ విధించిన ఆంక్షలన్నింటినీ దాదాపు తొలగించారు. అయితే ప్రతీ ఒక్కరూ కరోనా గైడ్ లైన్స్ పాటించాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. అయితే కరోనా కట్టడి నియమాలు పాటించనందున సుల్తాన్‌పూర్ సబ్జీ మండీ, రాణీ బాగ్ మార్కెట్‌లను మూసివేయాని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సోషల్ డిస్టెన్సింగ్ ఏమాత్రం కనిపించనందున సుల్తాన్‌పూర్ సబ్జీ మండీని మూడు రోజుల పాటు అంటే ఈ నెల 16 వరకూ మూసివేయనున్నారు. ఇదేవిధంగా కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘించినందున రాణీ బాగ్ బజార్‌ను కూడా మూసివేశారు. ఇంతకుముందు జనపథ్ మార్కెట్‌ను కూడా మూసివేశారు. 

Updated Date - 2021-07-14T13:11:38+05:30 IST