రైతు నిరసనలు.. దాడులను తట్టుకునేలా ఢిల్లీ పోలీసుల ‘ప్రత్యేక దళం’

ABN , First Publish Date - 2021-02-02T01:29:07+05:30 IST

రైతు నిరసనల నేపథ్యంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల కారణంగా ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది.

రైతు నిరసనలు.. దాడులను తట్టుకునేలా ఢిల్లీ పోలీసుల ‘ప్రత్యేక దళం’

న్యూఢిల్లీ: రైతు నిరసనల నేపథ్యంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల కారణంగా ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చిత్రాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. డాలును పోలినటువంటి రక్షణ కవచం.. స్టీలు లాఠీ, హెల్మెట్ ధరించిన ‘ప్రత్యేక పోలీసు బృందాలకు’ సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తున్నాయి. లాఠీ పట్టుకున్న సమయంలో చేతివేళ్ల చుట్టు రక్షణగా ఉండేందుకు ఓ స్టీల్ తొడుగును, మరో చేతికి డాలును పోలిన తొడుగును వారు ధరించారు.  పోలీసులపై దాడులు జరగకుండా నిరసన కారులను ఆమడ  దూరంలోనే ఉంచేందుకు వీలుగా వీటి రూపకల్పన జరిగినట్టు తెలుస్తోంది. ఈ లాఠీల పొడవు..సాధారణ కత్తికంటే రెండింతలు ఎక్కువగా ఉంది. కాగా.. శుక్రవారం నాడు అలీపూర్ వద్దు రైతు నిరసనల సందర్భంగా జరిగిన దాడిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తనపై కత్తులతో దాడి జరిగిందని కూడా ఆయన చెప్పారు. ఈ కేసుకు సంబంధించి రంజిత్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు పటిష్ట రక్షణ చర్యలకు పూనుకున్నారు.

Updated Date - 2021-02-02T01:29:07+05:30 IST