చక్కా జామ్ సందర్భంగా భారీ భద్రత

ABN , First Publish Date - 2021-02-06T14:52:14+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శనివారం చేపట్టిన చక్కా జామ్ కార్యక్రమం సందర్భంగా ఢిల్లీలో 40 వేలమంది పోలీసు, కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు....

చక్కా జామ్ సందర్భంగా భారీ భద్రత

న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శనివారం చేపట్టిన చక్కా జామ్ కార్యక్రమం సందర్భంగా ఢిల్లీలో 40 వేలమంది పోలీసు, కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు.దేశవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చక్కా జామ్ కార్యక్రమం కొనసాగుతున్న దృష్ట్యా ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర సైనిక బలగాలతో పహరా ఏర్పాటు చేశారు. ఢిల్లీ నగరంలోని 12 మెట్రో రైల్వేస్టేషన్లపై పోలీసులు నిఘా ఉంచారు. ఎర్రకోట వద్ద భారీఎత్తున పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.ఘాజీపూర్ సరిహద్దు వద్ద చక్కా జామ్ సందర్భంగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతులు గుమికూడకుండా చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కానన్ లను సిద్ధం చేసి ఉంచారు. కాగా ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ లలో శాంతియుతంగా నిరసన తెలుపుతామని రైతు సంఘాల నేతలు చెప్పారు.

Updated Date - 2021-02-06T14:52:14+05:30 IST