ఢిల్లీలో 255 కోవిడ్ కేసులు నమోదు, పాజిటివిటీ రేటు 0.35 శాతం
ABN , First Publish Date - 2021-06-13T23:14:15+05:30 IST
ఢిల్లీలో 255 కోవిడ్ కేసులు నమోదు, పాజిటివిటీ రేటు 0.35 శాతం
న్యూఢిల్లీ: కోవిడ్ నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ నిబంధనలను ప్రభుత్వం కఠినంగా అమలు పర్చడంతో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. నగరంలో శనివారం నమోదైన 213 కేసులతో పోలిస్తే ఆదివారం రోజు ఢిల్లీలో 255 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలో కోవిడ్-19 పాజిటివిటీ రేటు శనివారం 0.30 శాతంతో పోలిస్తే ఈ రోజు 0.35 శాతంగా ఉంది. గత 24 గంటల్లో ఢిల్లీలో 23 కోవిడ్-19 సంబంధిత మరణాలు నమోదవగా, కరోనా నుంచి 376 మంది కోలుకున్నారని ఢిల్లీ సర్కారు పేర్కొంది.