వివాహాలు, అంత్యక్రియల్లో 200 మంది పాల్గొనవచ్చు...

ABN , First Publish Date - 2021-02-01T16:48:52+05:30 IST

కొవిడ్-19 టీకాలు అందుబాటులోకి వచ్చాక కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వివాహాలు, అంత్యక్రియల్లో ఇక నుంచి 200 మంది పాల్గొనేందుకు అనుమతి ఇస్తూ...

వివాహాలు, అంత్యక్రియల్లో 200 మంది పాల్గొనవచ్చు...

ఢిల్లీ సర్కారు తాజా ఉత్తర్వులు

న్యూఢిల్లీ : కొవిడ్-19 టీకాలు అందుబాటులోకి వచ్చాక కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వివాహాలు, అంత్యక్రియల్లో ఇక నుంచి 200 మంది పాల్గొనేందుకు అనుమతి ఇస్తూ ఢిల్లీ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫంక్షన్ హాళ్లలో వివాహాలు, మతపరమైన సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అంత్యక్రియల్లో 200 మంది దాకా పాల్గొనేందుకు ఢిల్లీ సర్కారు అనుమతి ఇచ్చింది. ఫంక్షన్ హాళ్లలో 200 మందికి మించకుండా అతిథులు పాల్గొనేందుకు ఢిల్లీ సర్కారు అనుమతి ఇస్తూ ఢిల్లీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఫంక్షన్ హాళ్లలో అతిధులు విధిగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని సర్కారు సూచించింది. వివాహ హాళ్లలో అతిథులకు థర్మల్ స్ర్కీనింగ్ చేయాలని,  శానిటైజర్సు తప్పకుండా ఉంచాలని సర్కారు కోరింది. ఢిల్లీలో ఆదివారం 140 కొత్త కరోనా కేసులు నమోదైనాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 6,35,096కు పెరిగింది. 

Updated Date - 2021-02-01T16:48:52+05:30 IST