చిదంబరం, కార్తికి ఢిల్లీ కోర్టు సమన్లు
ABN , First Publish Date - 2021-11-28T08:28:41+05:30 IST
ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన కొడుకు కార్తికి ఢిల్లీ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.

న్యూఢిల్లీ, నవంబరు 27 : ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన కొడుకు కార్తికి ఢిల్లీ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 20న తమ ముందు హాజరు కావాలని ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఆదేశించారు. అవినీతి, మనీలాండరింగ్‌కు సంబంధించి వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమర్పించిన చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకున్న అనంతరం కోర్టు తాజా ఉత్తర్వులిచ్చింది.