టీకాల కొనుగోలులో జాప్యం చేశాం
ABN , First Publish Date - 2021-05-24T09:48:27+05:30 IST
విదేశాల నుంచి భారీగా వ్యాక్సిన్లను కొనుగోలు చేయడంలో భారత్ జాప్యం చేసిందని ప్రముఖ వైరాలజిస్టు, మెడికల్ ఆక్సిజన్‌పై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సభ్యురాలు డాక్టర్ గగన్‌దీ్‌ప

ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీ్‌ప కాంగ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మే 23: విదేశాల నుంచి భారీగా వ్యాక్సిన్లను కొనుగోలు చేయడంలో భారత్ జాప్యం చేసిందని ప్రముఖ వైరాలజిస్టు, మెడికల్ ఆక్సిజన్‌పై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సభ్యురాలు డాక్టర్ గగన్‌దీ్‌ప కాంగ్ అన్నారు. ఈ విషయంలో ఇతర దేశాలు మనకంటే వేగంగా స్పందించాయని పేర్కొన్నారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో టీకాల కొనుగోలుకు ఇప్పుడు మనకు అతికొద్ది అవకాశాలు మాత్రమే మిగిలాయని తెలిపారు. మహారాష్ట్ర, ఒడిసా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ వంటి పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించిన ప్రస్తుత తరుణంలో కాంగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాక్సిన్లను పూర్తిగా అభివృద్ధి చేయకముందే ప్రభుత్వాలు పెట్టుబడులు పెడితే ఆర్థికంగా నష్టం వాటిల్లదా? అన్న ప్రశ్నకు కాంగ్ బదులిస్తూ.. మనం ఆ మాత్రం రిస్క్ తీసుకోవాల్సిందేనన్నారు.