70 వేల మందికి పైగా రిజర్వేషన్‌

ABN , First Publish Date - 2021-11-02T14:56:09+05:30 IST

దీపావళి పండుగను సొంతూళ్లలో జరుపుకొనేందుకు వెళ్లే వారికోసం రాష్ట్ర రవాణా సంస్థలు సోమవారం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. చెన్నై నుంచి 3,385 ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని పలు

70 వేల మందికి పైగా రిజర్వేషన్‌

                            - దీపావళి ప్రత్యేక బస్సులు 


ప్యారీస్‌(Chennai): దీపావళి పండుగను సొంతూళ్లలో జరుపుకొనేందుకు వెళ్లే వారికోసం రాష్ట్ర రవాణా సంస్థలు సోమవారం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. చెన్నై నుంచి 3,385 ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు బయల్దేరి వెళ్లాయి. దీపావళి మరో రెండు రోజులు మాత్రమే ఉన్నందువల్ల రద్దీని నియంత్రించే దిశగా, కరోనా వైరస్‌ వ్యాప్తి బారిన పడకుండా ప్రజలను కాపాడే విధంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థలు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ముందుకొచ్చాయి. కోయంబేడు, పూందమల్లి, మాధవరం, కేకే నగర్‌, శానిటోరియం సహా పలు ప్రాం తాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. అదే విధంగా, పండుగ అనంతరం సొంతూళ్ల నుంచి చెన్నై తిరిగొచ్చేందుకు వీలుగా ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు 4,319 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో, దీపావళి ప్రత్యేక బస్సుల్లో ప్రయాణం కోసం సుమారు 70 వేల మందికి పైగా రిజర్వేషన్‌ చేసుకున్నారని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-11-02T14:56:09+05:30 IST