దళిత బాలికపై దారుణ హింస

ABN , First Publish Date - 2021-12-30T07:35:22+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో దళిత వర్గానికి చెందిన మైనర్‌ బాలికపై ఓ కుటుంబం దారుణంగా హింసకు పాల్పడింది. దొం గతనం చేసిందన్న ఆరోపణతో సదరు బాలికను ముగ్గురు వ్యక్తులు చి త్రహింసలకు గురిచేశారు...

దళిత బాలికపై దారుణ హింస

 యూపీలో నిర్దాక్షిణ్యంగా దాడిచేసిన ముగ్గురు వ్యక్తులు

లఖ్‌నవూ, డిసెంబరు 29: ఉత్తరప్రదేశ్‌లో దళిత వర్గానికి చెందిన మైనర్‌ బాలికపై ఓ కుటుంబం దారుణంగా హింసకు పాల్పడింది. దొం గతనం చేసిందన్న ఆరోపణతో సదరు బాలికను ముగ్గురు వ్యక్తులు చి త్రహింసలకు గురిచేశారు. ఇద్దరు వ్యక్తులు బాలికను పట్టుకోగా, మరో వ్యక్తి కర్రతో నిర్దాక్షిణ్యంగా కొట్టాడు. బాలిక జుట్టుపట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లారు. బాలిక ఆర్తనాదాలు చేస్తున్నా కొట్టడం ఆపలేదు. ఈ సంఘటన జరిగేటప్పుడు మరో ముగ్గురు మహిళలు పక్కనే ఉన్నారు. బాలికను దొంగతనం గురించి వారు ప్రశ్నిస్తున్నట్టు వీడియోలో మాట లు వినిపిస్తున్నాయి. యూపీలోని అమేథీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించారు. పోక్సోతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు పెట్టారు. నమన్‌ సో నీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సంఘటనపై కాంగ్రెస్‌ నేత ప్రి యాంక గాంధీ స్పందించారు. నిందితులను 24 గంటల్లోగా అరెస్టు చే యకపోతే ఆందోళన చేపడతామని సర్కారుకు ఇచ్చారు. మహిళలు, అణగారిన కులాలపై దాడులు పెరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

Updated Date - 2021-12-30T07:35:22+05:30 IST