వైరల్ వీడియో: దళిత బాలికను కిరాతకంగా కొట్టిన ఓ కుటుంబం

ABN , First Publish Date - 2021-12-30T00:08:42+05:30 IST

ఈ ఘటనపై కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలతో అలజడి సృష్టిస్తామని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా హెచ్చరించారు..

వైరల్ వీడియో: దళిత బాలికను కిరాతకంగా కొట్టిన ఓ కుటుంబం

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపివేస్తోంది. ఒక కుటుంబం దళిత మైనర్ బాలిక పట్ల ప్రవర్తించిన తీరు నెటిజెన్లను ఆగ్రహానికి గురి చేస్తోంది. దొందతనం నెపంతో చిన్నారి కాళ్లు కట్టేసి కర్రలతో పైశాచికంగా కొడుతుంటే నొప్పి తట్టుకోలేక చిన్నారి పెడుతున్న కేకలు ఆదేవదనకు గురి చేస్తున్నాయి. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన స్మృతి ఇరానీ నియోజకవర్గంలో జరిగిన సంఘటన ఇది. దీంతో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందుతున్నాయి.


ఈ ఘటనపై కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలతో అలజడి సృష్టిస్తామని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా హెచ్చరించారు. నిజం ఒప్పుకోమంటూ, సరిగ్గా చెప్పమంటూ పెద్ద పెద్ద కర్రలతో చిన్నారిని కొడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అధికార పార్టీ బీజేపీపై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అమేథి పోలీసులు తెలిపారు.







Updated Date - 2021-12-30T00:08:42+05:30 IST