ఆశోక చక్రం ఉన్న కేక్ కట్ చేస్తే.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

ABN , First Publish Date - 2021-03-22T22:51:07+05:30 IST

త్రివర్ణ పతాకంలోని రంగులు, అశోక చక్రం ఉన్న కేక్‌ను కట్ చేస్తే జాతియజెండాను అవమానించినటట్టు కాదని, దేశభక్తి లేనట్టు భావించరాదని మద్రాస్ హైకోర్టు సోమవారం నాడు స్పష్టం చేసింది.

ఆశోక చక్రం ఉన్న కేక్ కట్ చేస్తే.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

చెన్నై: త్రివర్ణ పతాకంలోని రంగులు, అశోక చక్రం ఉన్న కేక్‌ను కట్ చేస్తే జాతియజెండాను అవమానించినట్టు కాదని, దేశభక్తి లేనట్టు భావించరాదని మద్రాస్ హైకోర్టు సోమవారం నాడు స్పష్టం చేసింది. 2013 నాటి కేసుకు సంబంధించి తీర్పు ఇస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును డా. సెంథిల్ కుమార్ దాఖలు చేశారు. అప్పట్లో క్రిస్మస్ వేడుల సందర్భంగా 6*5 వైశాల్యంతో, జాతియజెండాలోని త్రివర్ణాలు, అశోక చక్రం కలిగిన కేక్‌ను కట్ చేసి దాదాపు 2500 మందికి పంచిపెట్టారు. నాటి వేడుకలకు కొయంబత్తూర్ కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ కూడా హాజరయ్యారు. 


దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సెంథిల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటువంటి కేక్‌ను కట్ చేయడాన్ని నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 చట్టం కింద నేరంగా పరిగణించాలని కోరారు. ఈ చట్టం కింద నేరం రుజువైతే మూడేళ్ల పాటు పాటు జైలు శిక్ష గానీ, జరిమానా గానీ లేదు రెండూ విధించే అవకాశం ఉంది. కాగా.. ఈ కేసుపై మద్రాసు హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఆ వేడుకల్లో పాల్గొన్న వారు జాతియ జెండాను అవమానించలేదని స్పష్టం చేసింది.  

Updated Date - 2021-03-22T22:51:07+05:30 IST