క్రూయిజ్ డ్రగ్స్ కేసు బీజేపీ కుట్ర: నవాబ్ మాలిక్

ABN , First Publish Date - 2021-10-29T21:52:21+05:30 IST

క్రూయిజ్ డ్రగ్స్ కేసు ఎన్‌సీబీ జోనల్ అధికారి సమీర్ వాంఖెడే ద్వారా బీజేపీ జరిపించిన 'కుట్ర' అని..

క్రూయిజ్ డ్రగ్స్ కేసు బీజేపీ కుట్ర: నవాబ్ మాలిక్

ముంబై: క్రూయిజ్ డ్రగ్స్ కేసు ఎన్‌సీబీ జోనల్ అధికారి సమీర్ వాంఖెడే ద్వారా బీజేపీ జరిపించిన 'కుట్ర' అని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ శుక్రవారంనాడు అన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, బాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. దీని వెనుక బీజేపీ ఉందని అన్నారు. డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిలు మంజూరు చేసిన మరుసటి రోజే నవాబ్ మాలిక్ తాజా వ్యాఖ్యలు చేశారు.


బాలీవుడ్‌ ప్రతిష్టను దిగజార్చి, ముంబై నుంచి చిత్ర పరిశ్రమను ఉత్తరప్రదేశ్‌కు తరలించేందుకే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయని నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  నొయిడాలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తుండటాన్ని ఈ సందర్భంగా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఈ కేసులో ఇప్పటికే ఇన్వెస్టిగేటింగ్ అధికారి వాంఖడేపై నవాబ్ మాలిక్ పలు విమర్శలు గుప్పించారు. వాంఖడే అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఉద్యోగం పొందారని విమర్శించారు. బాలీవుడ్ పరిశ్రమతో గేమ్స్ ఆడేందుకే వాంఖెడేను ప్రత్యేకించి ఎన్‌సీబీకి కేంద్రం తీసుకువచ్చిందన్నారు. మరోవైపు, వాఖండే ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారంటూ వాంఖడే సోదరి సమీప్ వాంఖడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మాధ్యమాలలోని తన ఫోటోలను అక్రమంగా మీడియాకు నవాబ్ మాలిక్ అందజేస్తున్నారంటూ తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2021-10-29T21:52:21+05:30 IST