నాటు బాంబు పేలుడు! 7 ఏళ్ల చిన్నారి మృతి!

ABN , First Publish Date - 2021-03-22T23:20:23+05:30 IST

నాటు బాంబు పేలడంతో ఏడేళ్ల చిన్నారి మరణించాడు. పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ నగరంలో సోమవారం నాడు ఈ ఘటన జరిగింది.

నాటు బాంబు పేలుడు! 7 ఏళ్ల చిన్నారి మృతి!

కోల్‌కతా: నాటు బాంబు పేలడంతో ఏడేళ్ల చిన్నారి మరణించాడు. పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ నగరంలో సోమవారం నాడు ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. షేక్ అఫ్రోజ్(7), షేక్ ఇబ్రహీం అనే ఇద్దరు చిన్నారులు తమ ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఈ దారుణం జరిగింది. తమ ఇంటి వద్ద ఉన్న ఓ పొట్లాన్ని వారు తాకగా.. అందులోని నాటు బాంబు పేలి వారికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద శబ్దం కావడంతో అప్రమత్తమైన స్థానికులు చిన్నారులను ఇద్దరినీ హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అయితే..అఫ్రోజ్ అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఇబ్రహీం ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కాగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే..రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 

Updated Date - 2021-03-22T23:20:23+05:30 IST