ప్రధాన్ని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టే: నడ్డా

ABN , First Publish Date - 2021-12-31T08:56:20+05:30 IST

ప్రధాని మోదీని విమర్శించే వారంతా దేశాన్ని విమర్శించినట్లేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు.

ప్రధాన్ని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టే: నడ్డా

ఇంఫాల్‌, డిసెంబరు 30: ప్రధాని మోదీని విమర్శించే వారంతా దేశాన్ని విమర్శించినట్లేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్‌లో గురువారం ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ‘‘ప్రధానిని విమర్శిస్తున్న విపక్షాలు దేశాన్ని కూడా విమర్శిస్తున్నామన్న సంగతి మరచిపోతున్నాయి. ప్రతిపక్షాలు అవినీతి, కమీషన్ల గురించే ఆలోచిస్తున్నాయి. దేశాన్ని ముం దుకు తీసుకెళ్ల గలిగే దూరదృష్టి మా పార్టీకి మాత్రమే ఉంది’’ అని నడ్డా తెలిపారు.

Updated Date - 2021-12-31T08:56:20+05:30 IST