కోవిడ్ వ్యాక్సిన్‌ ధరలను ప్రకటించిన కేంద్రం

ABN , First Publish Date - 2021-02-28T01:28:44+05:30 IST

కోవిడ్ వ్యాక్సిన్‌ ధరలను ప్రకటించిన కేంద్రం

కోవిడ్ వ్యాక్సిన్‌ ధరలను ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ప్రైవేట్‌లో ఒక్కో వ్యాక్సిన్‌ డోస్‌ రూ.250కి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇస్తారు. కోవిన్‌ 2.0 పోర్టల్‌లో నమోదుకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. మార్చి 1వ తేదీ నుంచి ప్రైవేట్‌లోనూ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.


రూ.100 సర్వీస్ ఛార్జ్‌తో కలిపి వ్యాక్సిన్‌ ధర రూ.250 ఉంటుంది. తెలంగాణలో 1,200 కేంద్రాల్లో 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. తెలంగాణలో 200 ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో 545 ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు, దేశవ్యాప్తంగా 7,936 ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఉంటాయి.

Updated Date - 2021-02-28T01:28:44+05:30 IST