break the chain : పిల్లలకు సెప్టెంబరు నాటికి కొవిడ్ టీకాలు
ABN , First Publish Date - 2021-07-24T16:35:24+05:30 IST
సెప్టెంబరు కల్లా పిల్లలకు కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్....

ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రందీప్ గులేరియా వెల్లడి
న్యూఢిల్లీ : సెప్టెంబరు కల్లా పిల్లలకు కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా శనివారం వెల్లడించారు.పిల్లలకు వ్యాక్సిన్లు వేయడం వల్ల కరోనా ప్రసార గొలుసును విఛ్చిన్నం చేయడానికి ఉపయోగపడుతుందని డాక్టర్ గులేరియా చెప్పారు. జైడస్ ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ చేసిందని, అత్యవసర అనుమతి కోసం జైడస్ వ్యాక్సిన్ కంపెనీ ఎదురుచూస్తుందని చెప్పారు.భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాక్సిన్ ట్రయల్స్ ఆగస్టు, సెప్టెంబరు నాటికి ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫైజర్ వ్యాక్సిన్ ఇప్పటికే ఎఫ్ డీఏ ఆమోదం పొందిందని డాక్టర్ తెలిపారు. భారతదేశంలో ఇప్పటివరకు 42 కోట్లకు పైగా ప్రజలకు వ్యాక్సిన్లు ఇచ్చామని, ఈ సంవత్సరం డిసెంబరు నాటికి పెద్దలందరికీ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డాక్టర్ వివరించారు.