కోవిడ్ గాలి ద్వారా వ్యాపిస్తోంది... ఎన్95/కేఎన్95 మాస్క్ వాడాలి...

ABN , First Publish Date - 2021-04-18T20:22:26+05:30 IST

కోవిడ్-19 గాలి ద్వారా వ్యాపిస్తుందని, దీని నుంచి తప్పించుకోవడానికి

కోవిడ్ గాలి ద్వారా వ్యాపిస్తోంది... ఎన్95/కేఎన్95 మాస్క్ వాడాలి...

న్యూఢిల్లీ : కోవిడ్-19 గాలి ద్వారా వ్యాపిస్తుందని, దీని నుంచి తప్పించుకోవడానికి  ఎన్95/కేఎన్95 మాస్క్ వాడాలని డాక్టర్ ఫహీం యూనస్ చెప్పారు. లాన్సెట్ అధ్యయన నివేదికపై స్పందిస్తూ ట్విటర్ వేదికగా డాక్టర్ యూనస్ ఈ సలహా ఇచ్చారు. గాలి ద్వారా వ్యాపించే రోగ కారకానికి పరిష్కారం రెండు  ఎన్95 లేదా కేఎన్95 మాస్క్‌లను కొనుక్కోవడమని చెప్పారు. వాటిలో ఒకదానిని ఒక రోజు ధరించి, రెండోదానిని కాగితపు సంచీలో దాచుకుని,  ఆ మరుసటి రోజు వాడుకోవాలని తెలిపారు. 24 గంటలకోసారి మాస్క్‌ను మార్చాలన్నారు. దెబ్బతినకుండా ఉన్నంత వరకు ఒకే మాస్క్‌ను కొద్ది వారాలపాటు వాడవచ్చునని తెలిపారు. గుడ్డతో తయారు చేసిన మాస్క్‌లను వాడిన తర్వాత పారేయాలన్నారు. గాలి ద్వారా వ్యాపించడమంటే, వైరస్ గాలిలో నిలిచి ఉండవచ్చునని, ముఖ్యంగా నాలుగు గోడల మధ్య ఉండే గాలిలో ఈ వైరస్ ఉండే అవకాశం ఉందన్నారు. దీనివల్ల రిస్క్ ఉంటుందన్నారు. 


లాన్సెట్ కోవిడ్-19 కమిషన్ నివేదికపై మేరీల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగాధిపతి స్పందిస్తూ, గాలి ద్వారా కోవిడ్-19 వ్యాపిస్తుందంటే గాలి కలుషితమైనట్లు కాదన్నారు. 


ది లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన అధ్యయన నివేదికలో సార్స్-కోవ్-2 (నోవల్ కరోనావైరస్) గాలి ద్వారా వ్యాపిస్తుందని పేర్కొన్నారు. మానవుల సాహచర్యాలు, ఇతర అంశాల సవివర విశ్లేషణలను నోటి తుంపరలు, బట్టలు, పాత్రలు, ఫర్నిచర్ వంటివాటి ద్వారా తగిన స్థాయిలో వివరించడం సాధ్యం కాదని పరిశోధకులు పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-18T20:22:26+05:30 IST