కరోనాతో జర్మన్ వృద్ధురాలి మృతి
ABN , First Publish Date - 2021-05-08T16:15:08+05:30 IST
జర్మన్ దేశానికి చెందిన వృద్ధురాలు బార్బరా (80) కరోనా సోకి మరణించింది. మహాబలిపురం ఒట్రైవాడై వీధిలోని ప్రైవేట్ రిసార్ట్‌లో ఏడాదికి పైగా బార్బరా నివసిస్తోంది. ఆమెకు ఓ యువకుడు అ

ఐసిఎఫ్(చెన్నై): జర్మన్ దేశానికి చెందిన వృద్ధురాలు బార్బరా (80) కరోనా సోకి మరణించింది. మహాబలిపురం ఒట్రైవాడై వీధిలోని ప్రైవేట్ రిసార్ట్‌లో ఏడాదికి పైగా బార్బరా నివసిస్తోంది. ఆమెకు ఓ యువకుడు అసిస్టెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, అస్వస్థత కారణంగా బార్బరా గత నెల 28న కేళంబాక్కం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. ఆమె నిర్వహించిన వైద్యపరీక్షలో కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీంతో చెంగల్పట్టు ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్సలు ఫలించక ఆమె మృతిచెందింది. ఈ విషయమై మహాబలిపురం రెవెన్యూ శాఖ అధికారులు చెన్నైలోని జర్మన్ దౌత్య కార్యాలయానికి సమాచారం అందించారు.