కరోనా తగ్గుముఖం.. పెరిగిన స్వదేశీ విమాన ప్రయాణికులు

ABN , First Publish Date - 2021-06-22T14:42:43+05:30 IST

కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో చెన్నై డొమెస్టిక్‌ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో తిరుచ్చి, మదురై, బెంగుళూరు, హైదరాబాద్‌, ఢిల్లీ తదితర ప్రాంతాలకు విమానయా

కరోనా తగ్గుముఖం.. పెరిగిన స్వదేశీ విమాన ప్రయాణికులు


ప్యారీస్‌(చెన్నై): కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో చెన్నై డొమెస్టిక్‌ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో తిరుచ్చి, మదురై, బెంగుళూరు, హైదరాబాద్‌, ఢిల్లీ తదితర ప్రాంతాలకు విమానయాన సంస్థలు అదనపు విమానాలను నడుపుతున్నాయి. రాష్ట్రంలో కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. మే నెల 21వ తేదీన అధికపక్షంగా 36,184 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పుడు సుమారు 7 వేల కేసులు బయల్పడుతున్నాయి. పరిస్థితి చక్కబడుతుండడంతో చెన్నై నుంచి దేశంలోని పలు ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ఈనెల 11వ తేదీన నగరం నుంచి నూరుకు పైగా విమానాలను నడపగా, వాటిలో 5 వేల మందికి పైగా ప్రయాణించారు. కాగా ఆదివారం ఒక్కరోజు మాత్రమే 127 విమానాలు చెన్నై నుంచి బయలుదేరి వెళ్లగా, వాటిలో 8 వేల మందికి పైగా ప్రయాణించారు. సోమవారం కూడా ఇదే స్థాయిలో విమానాలు తిరుగాడాయి. చెన్నై-తిరుచ్చి మధ్య గత రెండు నెలలుగా రోజుకు ఒక విమానం మాత్రమే నడిపారు. ప్రస్తుతం రెండు విమానాలను నడుపుతున్నారు.

Updated Date - 2021-06-22T14:42:43+05:30 IST