నిన్న ఒక్కరోజే ఆ జిల్లాలో కరోనాతో ఎంతమంది మృతిచెందారో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-05-05T17:32:25+05:30 IST

జిల్లాలో కరోనాతో మంగళవారం ఒక్కరోజే 27 మంది మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 793కు చేరిందని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,280 మందికి

నిన్న ఒక్కరోజే ఆ జిల్లాలో కరోనాతో ఎంతమంది మృతిచెందారో తెలిస్తే..


బళ్లారి(కర్ణాటక): జిల్లాలో కరోనాతో మంగళవారం ఒక్కరోజే 27 మంది మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 793కు చేరిందని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,280 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. బళ్ళారి తాలూకాలో 647, సండూరు 181, సిరుగుప్ప 79, కూడ్లిగి 70, హడగలి 55, హొసపేట 132, హగరిబొమ్మనహళ్ళి 53, హరపనహళ్ళి 63 మంది ఉన్నారు. 


‘రాయచూరు’లో ఇద్దరు..

రాయచూరు: జిల్లాలో కరోనాతో మంగళవారం ఇద్దరు మరణించినట్లు కలెక్టర్‌ వెంకటేశ్‌ కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ..  కొత్తగా మరో 817 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు చెప్పారు.  


సిరుగుప్ప తాలూకాలో వృద్ధురాలు ..

సిరుగుప్ప: తాలూకా పరిధిలో కరోనా కారణంగా నాగరత్నమ్మ (65) మరణించారని, దీంతో మృతుల సంఖ్య 16కు చేరిందని  తాలూకా ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి డాక్టర్‌ ఈరణ్ణ మంగళవారం తెలిపారు. తాలూకాలో సెకెండ్‌ వేవ్‌ ప్రారంభం నుంచి నేటి వరకు 500 పైగా కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించడం అత్యవసరమని తెలిపారు. 

Updated Date - 2021-05-05T17:32:25+05:30 IST