బెంగళూరులో బెంబేలెత్తించిన Covid కేసులు

ABN , First Publish Date - 2021-12-30T17:49:22+05:30 IST

రాష్ట్రంలో నాలుగు నెలల తర్వాత కొవిడ్‌ కేసులు భారీగా పెరిగాయి. ప్రత్యేకించి బెంగళూరులో ఒక్కరోజులో 400 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 566 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 8 జిల్లాల్లో

బెంగళూరులో బెంబేలెత్తించిన Covid కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో నాలుగు నెలల తర్వాత కొవిడ్‌ కేసులు భారీగా పెరిగాయి. ప్రత్యేకించి బెంగళూరులో ఒక్కరోజులో 400 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 566 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 8 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 16 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదు కాగా మూడు జిల్లాల్లో 20 మందిలోపు నమోదయ్యారు. 245 మంది కోలుకోగా ఆరుగురు మృతి చెందారు. వీరిలో బెంగళూరుకు చెందినవారే నలుగురు కాగా చిత్రదుర్గ, తుమకూరులో ఒక్కొక్కరు ఉన్నారు. వివిధ జిల్లా ఆసుపత్రుల్లో 7,771 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2021-12-30T17:49:22+05:30 IST