రాష్ట్రంలో నిలకడగా Covid కేసులు

ABN , First Publish Date - 2021-12-07T17:35:30+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 301 మందికి పాజిటివ్‌ ని ర్ధారణ కాగా బెంగళూరులో 162, చిక్కమగళూరులో 40 మందికి పాజిటివ్‌ ప్రబలింది. 10-20లోపు మూడు జిల్లాల్లో

రాష్ట్రంలో నిలకడగా Covid కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 301 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 162, చిక్కమగళూరులో 40 మందికి పాజిటివ్‌ ప్రబలింది. 10-20లోపు మూడు జిల్లాల్లో నమోదు కాగా 9 జిల్లాల్లో ఒక్కకేసూ చోటు చేసుకోలేదు. 16 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. 359 మంది కోలుకోగా ఏడుగురు మృతి చెందారు. వీరిలో బెంగళూరులో ముగ్గురు, దక్షిణకన్నడలో ఇద్దరు, రెండు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 26 జిల్లాల్లో ఒక్కరూ మృతి చెందలేదు. ప్రస్తుతం 7,067 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2021-12-07T17:35:30+05:30 IST