ఒకే కుటుంబంలో 8మందికి Covid

ABN , First Publish Date - 2021-12-26T16:38:31+05:30 IST

తూత్తుకుడి జిల్లా కోయిల్‌పట్టిలో ఒకే కుటుంబంలో ఎనిమిదిమందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే వీరికి ఒమైక్రాన్‌ నిర్ధారణ కోసం నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. వీరంతా మలేషియా నుంచి వచ్చినవారే కావడం

ఒకే కుటుంబంలో 8మందికి Covid

ప్యారీస్‌(చెన్నై): తూత్తుకుడి జిల్లా కోయిల్‌పట్టిలో ఒకే కుటుంబంలో ఎనిమిదిమందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే వీరికి ఒమైక్రాన్‌ నిర్ధారణ కోసం నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. వీరంతా మలేషియా నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. కోయిల్‌పట్టిలో నివశిస్తున్న తమ తల్లిదండ్రులను చూసేందుకు వచ్చారు. మలేషియాలో కరోనా పరీక్షలు జరుపుకుని, నెగెటివ్‌ అని తేలాకే భారత్‌ వచ్చారు. కానీ ఇక్కడకు వచ్చాక తలనొప్పి, గొంతునొప్పితో బాధపడుతుండడంతో అధికారులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏడేళ్ల చిన్నారి మినహా, మిగిలిన ఏడుగురికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరంతా వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-12-26T16:38:31+05:30 IST