బ్రెజిల్‌లో కరోనా విలయ తాండవం... కేసుల నమోదులో రెండవ స్థానం!

ABN , First Publish Date - 2021-03-14T13:42:38+05:30 IST

బ్రెజిల్‌లో మరోమారు కరోనా విలయతాండవం చేస్తోంది.

బ్రెజిల్‌లో కరోనా విలయ తాండవం... కేసుల నమోదులో రెండవ స్థానం!

బ్రెజిలియా: బ్రెజిల్‌లో మరోమారు కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొంతకాలంగా బ్రెజిల్‌లో రోజుకు 70 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా రోజుకు 2 వేలకుపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కేసుల నమోదులో ఇప్పుడు బ్రెజిల్ ప్రపంచంలోనే రెండవ స్థానానికి చేరుకుంది. కరోనా మరణాల విషయంలోనూ ఎప్పటి నుంచో బ్రెజిల్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. 


కరోనా కేసుల నమోదు విషయంలో అమెరికా ఇప్పటికీ మొదటి స్థానంలో కొనసాగుతోంది. బ్రెజిల్‌లో కరోనా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిజిల్‌లో కరోనాను అదుపు చేసేందుకు కఠిన చర్యలు చేపట్టాల్సిన ఆవసరం ఉందని పేర్కొంది. కాగా ప్రస్తుతం బ్రెజిల్‌లో ఒక కోటీ 13 లక్షల, 63వేల 380 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఈ దేశంలో 2 లక్షల 75 వేల 105 మంది మృతి చెందారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం బ్రెజిల్‌లో కరోనా మరణాలకు కొత్త వేరియంట్ కారణమని చెబుతున్నారు. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, రెండవసారి కూడా ప్రజలకు సోకుతున్నదని పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-14T13:42:38+05:30 IST