లైంగిక వేధింపుల గురించి అమ్మాయిలకు కాదు అబ్బాయిలకు కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-12-30T07:33:16+05:30 IST

లైంగిక వేధింపుల గురించి కౌన్సెలింగ్‌ సెషన్‌ ఏర్పాటుచేసిన ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ఊహించని వివాదంలో చిక్కుకుంది.

లైంగిక వేధింపుల గురించి అమ్మాయిలకు కాదు అబ్బాయిలకు కౌన్సెలింగ్‌

 కౌన్సెలింగ్‌ సెషన్‌పై జేఎన్‌యూలో వివాదం

న్యూఢిల్లీ, డిసెంబరు 29: లైంగిక వేధింపుల గురించి కౌన్సెలింగ్‌ సెషన్‌ ఏర్పాటుచేసిన ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ఊహించని వివాదంలో చిక్కుకుంది. కౌన్సెలింగ్‌ సెషన్‌ గురించి వివరిస్తూ వర్సిటీ విడుదల చేసిన ఆహ్వానపత్రం వివాదానికి దారితీసిం ది. ఆహ్వానపత్రంలో... ‘కౌన్సెలింగ్‌ సెషన్‌ ఎందుకంటే..’ అనే శీర్షిక కింద... ‘‘అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు అబ్బాయిలు సాధారణంగా హద్దుమీరుతుంటారు. కొన్నిసార్లు అనుకోకుండా, లేదా కావాలనో అబ్బాయిలు సరదాగా అలా ప్రవర్తిస్తుంటారు. అందువల్ల అమ్మాయిలు లైంగిక వేధింపుల గురించి తెలుసుకోవాలి. అబ్బాయిలు హద్దు మీరుతుంటే, ఆ విషయాన్ని గుర్తించి వేధింపుల నుంచి తప్పించుకోవాలి’’ అని రాశారు. దీనిపై విద్యార్థినులు, అధ్యాపకులు తీవ్ర నిరసన తెలిపారు. జాతీయ మహిళా కమిషన్‌ కూడా ఈ అంశంపై స్పందించింది. సంబంధిత స ర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ వర్సిటీని కోరారు. ఆహ్వానపత్రంలో వర్సిటీ మార్పులు చేయడంతో వివాదం సద్దుమణిగింది.

Updated Date - 2021-12-30T07:33:16+05:30 IST