అవినీతి మచ్చ లేకుండా తప్పుకున్నా: బాబుల్
ABN , First Publish Date - 2021-07-08T08:07:15+05:30 IST
కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో బుధవారం భావోద్వేగభరిత పోస్ట్ చేశారు.

న్యూఢిల్లీ, జూలై 7: కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో బుధవారం భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. ‘కొందరు మీడియా మిత్రులు నాకు ఫోన్లు చేస్తున్నారు. అయితే, వారితో మాట్లాడే పరిస్థితిలో లేను. ఈ పోస్టులో వివరణ ఇస్తున్నాను. అవును.. నేను మంత్రి పదవికి రాజీనామా చేశాను. ఆ పదవి ద్వారా ఇన్నాళ్లు దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బెంగాల్ నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు.