కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి తరపున TMC పోటీ

ABN , First Publish Date - 2021-12-19T14:22:14+05:30 IST

అన్నాడీఎంకే కూటమి తరఫున కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తమిళ మానిల కాంగ్రెస్‌ (టీఎంసీ) అధ్యక్షుడు జీకే వాసన్‌ ప్రకటించారు. టీఎంసీ 8వ వార్షిక ప్రారంభోత్సవ వేడుకలు శనివారం స్థానిక

కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి తరపున TMC పోటీ

                   - వార్షికోత్సవంలో అధినేత జీకే వాసన్‌


ప్యారీస్‌(చెన్నై): అన్నాడీఎంకే కూటమి తరఫున కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తమిళ మానిల కాంగ్రెస్‌ (టీఎంసీ) అధ్యక్షుడు జీకే వాసన్‌ ప్రకటించారు. టీఎంసీ 8వ వార్షిక ప్రారంభోత్సవ వేడుకలు శనివారం స్థానిక వడపళనిలో జీకే వాసన్‌ అధ్యక్షతన జరిగాయి. పార్టీ అధికార ప్రతినిధి జీఆర్‌ వెంకటేశ్‌, మాజీ ఎమ్మెల్యే విడియల్‌ శేఖర్‌, జిల్లా అధ్యక్షులు ఈకే అరుణ్‌కుమార్‌, బిజూచాకో, సైదై మనోహరన్‌, గోవిందస్వామి, మాజీ కౌన్సిలర్‌ రాణికృష్ణన్‌ సహా అన్ని జిల్లాల పార్టీ నిర్వాహకులు, ప్రధాన నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-19T14:22:14+05:30 IST