23 మంది ఆటోవాలాలకు ఒకేసారి కరోనా పాజిటివ్!

ABN , First Publish Date - 2021-03-24T13:57:44+05:30 IST

గుజరాత్‌లోని సూరత్‌లో ఒకేసారి 32 మంది ఆటోవాలాలకు కరోనా సోకింది.

23 మంది ఆటోవాలాలకు ఒకేసారి కరోనా పాజిటివ్!

సూరత్:  గుజరాత్‌లోని సూరత్‌లో ఒకేసారి 32 మంది ఆటోవాలాలకు కరోనా సోకింది. సూపర్ స్ప్రెడర్ కోసం గాలింపు చేపడుతున్న సమయంలో ఈ ఆటోడ్రైవర్లకు కరోనా సోకినట్లు తేలింది. ఇదిలావుండగా సూరత్‌లో కొత్తగా 429 మందికి కరోనా సోకింది. ఈ సందర్భంగా సూరత్ మున్సిపల్ కమిషనర్ బీఎన్ పణి మాట్లాడుతూ సూపర్ స్ప్రెడర్‌ను గుర్తించేందుకు ఆటో డ్రైవర్లు, కూరగాయల విక్రేతలు, దుకాణదారులకు కరోనా పరీక్షలు నిర్వహించామని, వీరిలో 34 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలిందన్నారు. కాగా సూరత్‌లో కరోనా కేసుల సంఖ్య 45,182కు చేరింది. వీరిలో 42,544 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 862 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. 

Updated Date - 2021-03-24T13:57:44+05:30 IST