యాంటీజెన్ కంటే.. శునకాలే భేష్..!
ABN , First Publish Date - 2021-05-21T09:08:41+05:30 IST
విశ్వాసానికి మారుపేరైన శునకాలు.. నేరస్థులను, ఫోరెన్సిక్ ఆధారాలను, మాదక ద్రవ్యాలను, ఉగ్రవాదులు పెట్టే పేలుడు పదార్థాలనే కాదు.. కరోనా వైర్‌సను కూడా గుర్తిస్తాయి.

97% కచ్చితత్వంతో.. పాజిటివ్‌లను గుర్తిస్తాయి
ఫ్రాన్స్ శాస్త్రవేత్తల పరిశోధన
పారిస్, మే 20: విశ్వాసానికి మారుపేరైన శునకాలు.. నేరస్థులను, ఫోరెన్సిక్ ఆధారాలను, మాదక ద్రవ్యాలను, ఉగ్రవాదులు పెట్టే పేలుడు పదార్థాలనే కాదు.. కరోనా వైర్‌సను కూడా గుర్తిస్తాయి. కొంత శిక్షణ ఇస్తే.. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని ఇట్టే పసిగడతాయి. ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష(ర్యాట్) కంటే మెరుగ్గా.. 97ు కచ్చితత్వంతో శునకాలు పాజిటివ్‌లను గుర్తిస్తాయని వారు వెల్లడించారు. కొవిడ్ నుంచి కోలుకుని నెగటివ్ వచ్చిన వారిని 91ు కచ్చితత్వంతో గుర్తిస్తున్నాయని తెలిపారు. అంతేకాదు.. శునకాలు సెకన్ల వ్యవధిలో ఫలితాన్ని తేల్చేస్తాయని వివరించారు. రద్దీగా రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో శునకాల ద్వారా కరోనా సోకిన వారిని సులభంగా గుర్తించవచ్చంటున్నారు. పారి్‌సలోని నేషనల్ వెటర్నరీ స్కూల్‌లో కరోనాను గుర్తించడంలో శునకాలకు తర్ఫీదునిచ్చామని, మార్చి-ఏప్రిల్ నెలల్లో 335 మంది వలంటీర్లపై ఈ పరిశోధనలు చేశామని, వారిలో 109 మందికి పీసీఆర్‌లో పాజిటివ్ వచ్చిందని, వారందరి నమూనాలను శునకాలు క్షణాల్లో పాజిటివ్‌గా గుర్తించాయని తెలిపారు. ప్రస్తుతం ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, దుబాయ్‌ల్లో కూడా శునకాలకు శిక్షణనిస్తున్నారు.