భారత్‎లో 4 లక్షలకు పైగా కరోనా కేసులు..4వేల మరణాలు

ABN , First Publish Date - 2021-05-08T15:08:10+05:30 IST

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. మరోవైపు ఆక్సిజన్ అందక, బెడ్లు దొరకక ప్రజల ప్రాణాలు...

భారత్‎లో 4 లక్షలకు పైగా కరోనా కేసులు..4వేల మరణాలు

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. మరోవైపు ఆక్సిజన్ అందక, బెడ్లు దొరకక ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 4,01,708 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 4,187 మంది మృతి చెందారు. భారత్‎లో ఇప్పటి వరకు మొత్తం 2,18,92,676 కరోనా కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 2,38,270 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ప్రస్తుతం 37,23,446 యాక్టివ్‌ కేసులు ఉండగా..1,79,30,960 మంది డిశ్చార్జ్‌ అయినట్లు శనివారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ తెలిపింది.

Updated Date - 2021-05-08T15:08:10+05:30 IST