యూపీలో కనిపించిన కప్పా వేరియంట్... వైద్యాధికారుల్లో ఆందోళన!

ABN , First Publish Date - 2021-07-08T17:38:04+05:30 IST

యూపీలో కప్పా వేరియంట్ కలకలం రేపుతోంది.

యూపీలో కనిపించిన కప్పా వేరియంట్... వైద్యాధికారుల్లో ఆందోళన!

లక్నో: యూపీలో కప్పా వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ వేరియంట్ ను వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా పేర్కొన్నారు. కరోనా వైరస్ కొత్త రూపాలు డెల్టా, డెల్టా ప్లస్, కప్పా వేరియంట్‌లుగా కనిపిస్తున్నాయి.  యూపీలోని బీఆర్డీ మెడికల్ కాలేజీ మైక్రోబయాలజీకి చెందిన డాక్టర్ అమరేష్ సింగ్ మాట్లాడుతూ కరోనాలోని కప్పా వేరియంట్ తొలిసారిగా యూపీలో కనిపించింది. ఇది బీ 1.617 జన్యువు మ్యుటేషన్‌తో ఉద్భవించింది. ఇది డెల్టా వేరియంట్‌కు కారణంగా నిలుస్తుంది. బీ.1.617కు 12కుపైగా మ్యుటేషన్లు ఏర్పడ్డాయి. వీటిలో ప్రధానంగా ఈ4848 క్యూ, ఎల్452 ఆర్ కనిపిస్తున్నాయి. అందుకే ఈ వేరియంట్ ను డబుల్ మ్యుటెంట్‌గా పిలుస్తున్నారు. ఇది మెల్లమెల్లగా అభివృద్ధి చెంది  బీ.1.617కు సంబంధించిన కొత్త వంశాన్ని సిద్ధం చేస్తుంది. బీ.1.617.2ను డెల్టా వేరియంట్‌గా పిలుస్తారు. ఇదే భారత్‌లో కరోనా సెకెండ్ వేవ్‌కు కారణంగా నిలిచింది. కరోనాకు చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ అత్యంత ప్రమాదకారి అని నిపుణులు తెలిపారు. 

Updated Date - 2021-07-08T17:38:04+05:30 IST