భారత్‌లో కొత్తగా 10,243 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-11-02T16:14:31+05:30 IST

దేశంలో గడిచిన 24 గంటల్లో 10,243 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...443 మంది మృతి చెందారు.

భారత్‌లో కొత్తగా 10,243 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 10,243 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... 443 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 15,021 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,96,237కి చేరింది. అలాగే మొత్తం 3,36,83,581 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం  1,53,776 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,58,880గా ఉంది. 1,06,85,71,879 మంది టీకా తీసుకున్నారు. 

Updated Date - 2021-11-02T16:14:31+05:30 IST