భారత్‌లో కొత్తగా 3,82,315 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-05T15:31:47+05:30 IST

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,82,315 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా

భారత్‌లో కొత్తగా 3,82,315  కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,82,315 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, 3,780 మంది కరోనా బారిన పడి మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. అలాగే 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,38,439 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 2,06,65,148కి చేరింది. అలాగే కోలుకున్న వారి సంఖ్య 1,69,51,731గా ఉంది. ప్రస్తుతం 34,87,229 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో మొత్తం  2,26,188 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 16,04,94,188 మంది కొవిడ్ టీకా తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

Updated Date - 2021-05-05T15:31:47+05:30 IST