బీజేపీలో జితిన్‌ చేరికపై కాంగ్రెస్‌లో అంతర్మథనం

ABN , First Publish Date - 2021-06-11T08:05:44+05:30 IST

ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జితిన్‌ ప్రసాద బీజేపీలో చేరడంతో కాంగ్రె్‌సలో అంతర్మథనం మొదలైంది. ఒకవైపు పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌...

బీజేపీలో జితిన్‌ చేరికపై కాంగ్రెస్‌లో అంతర్మథనం

  • పార్టీలో సంస్కరణలపై డిమాండ్‌ 

న్యూఢిల్లీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జితిన్‌ ప్రసాద బీజేపీలో చేరడంతో కాంగ్రె్‌సలో అంతర్మథనం మొదలైంది. ఒకవైపు పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌, నవజోత్‌ సింగ్‌ సిద్దూల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం సతమతమవుతున్న సమయంలో జితిన్‌ బీజేపీలో చేరడం పార్టీకి అశనిపాతంగా పరిణమించింది. చాలా మంది సీనియర్‌ నేతలు మాత్రం జితిన్‌ చర్యను తప్పుపట్టారు. పార్టీలో సంస్కరణలు చేయాలని డిమాండ్‌ చేశారు. జితిన్‌ తండ్రి జితేంద్ర ప్రసాద కట్టుబడిన కాంగ్రెస్‌ సిద్ధాంతానికి కుమారుడు ద్రోహం చేశారని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాంగ్రె్‌సకు వెంటనే సంస్కరణలు అవసరమని, పార్టీ నాయకత్వం వినడం నేర్చుకోవాలని కపిల్‌ సిబల్‌ అభిప్రాయపడ్డారు. జితిన్‌ నిర్ణయం తనకెంతో బాధ కలిగించిందని మరో నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. కాంగ్రె్‌సకు పెద్ద శస్త్రచికిత్స అవసరమని, వారసత్వంపైనే ఆధారపడరాదని వీరప్ప మొయిలీ అన్నారు. మరోవైపు, పంజాబ్‌ కాంగ్రె్‌సలో ఏర్పడిన వర్గపోరు సమస్యను పరిష్కరించేందుకు నియమించిన ముగ్గురు సభ్యుల ఏఐసీసీ ప్యానెల్‌ తన నివేదికను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించింది. కులాలు, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికీ పార్టీలో స్థానం ఇవ్వాలని ప్యానెల్‌ తన నివేదికలో సూచించింది.


Updated Date - 2021-06-11T08:05:44+05:30 IST