సునీల్ దేశ్‌ముఖ్ రాకతో 'మహా' కాంగ్రెస్‌లో జోష్...

ABN , First Publish Date - 2021-06-22T01:12:50+05:30 IST

భారతీయ జనతా పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన మహారాష్ట్ర మాజీ మంత్రి సునీల్..

సునీల్ దేశ్‌ముఖ్ రాకతో 'మహా' కాంగ్రెస్‌లో జోష్...

ముంబై: భారతీయ జనతా పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన మహారాష్ట్ర మాజీ మంత్రి సునీల్ దేశ్‌ముఖ్‌కు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సోమవారంనాడు ముంబైలో సాదర స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్చాలు అందిస్తూ, విక్టరీ సంకేతాలు చూపించారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా గత శనివారంనాడు ఆయన బీజేపీకి ఉద్వాసన చెప్పి కాంగ్రెస్‌లో తిరిగి చేరారు. మహారాష్ట్ర కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన రాహుల్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన తిరిగి పార్టీలోకి వచ్చారు. ఆయనకు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హెచ్‌కే పటేల్ సాదర స్వాగతం పలికారు.


సునీల్ దేశ్‌ముఖ్ 2014 వరకూ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఒకసారి రాష్ట్ర యువజన కాంగ్రెస్ విభాగం చీఫ్‌గా పనిచేశారు. 2004లో కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో ఆయన కాంగ్రెస్‌ను వదలిపెట్టి బీజేపీలో చేరారు. తాజాగా ఆయన రాహుల్ బర్త్‌డే సందర్భంగా మరోసారి సొంతగూటికి చేరారు. దేశ్‌ముఖ్‌తో పాటు, 18 మంది బీజేపీ కార్పొరేటర్లు, ఎన్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌హెచ్ దిలీప్ బాన్సోడే తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Updated Date - 2021-06-22T01:12:50+05:30 IST