ఆర్మీ శిక్షణా పాఠ్య ప్రణాళికలో భగవద్గీత...కస్సుమన్న కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-09-03T22:49:33+05:30 IST

ఇండియన్ ఆర్మీ ఇచ్చే శిక్షణా కరిక్యులమ్‌లో భగవద్గీత, కౌటిల్యుని అర్ధశాస్త్రం చేర్చాలనే..

ఆర్మీ శిక్షణా పాఠ్య ప్రణాళికలో భగవద్గీత...కస్సుమన్న కాంగ్రెస్

న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ ఇచ్చే శిక్షణా కరిక్యులమ్‌లో భగవద్గీత, కౌటిల్యుని అర్ధశాస్త్రం చేర్చాలనే ప్రతిపాదనపై కాంగ్రెస్ కస్సుమంది. కనీసం మిలటరీకి సంబంధించిన అంశాలనైనా రాజకీయ చేయకుండా ఉంటే మంచిదని పేర్కొంది. కాంగ్రెస్ ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ, మిలటరీ అంశాల విషయంలోనైనా రాజకీయాల జోలిక ప్రభుత్వం వెళ్లకుండా ఉంటే మంచిదన్నారు. ముస్లిం సైనికుల హెల్ప్‌తోనే కార్గిల్ యుద్ధాన్ని మనం గెలిచామనే విషయాన్ని విస్మరించరాదని పేర్కొన్నారు. కాలేజీ ఆఫ్ డిఫెన్స్ మేనేజిమెంట్ (సీడీఎం) ఇటీవల అంతర్గత అధ్యయనం నిర్వహించి, కౌటిల్య అర్ధశాస్త్రం, భగవద్గీత వంటి పురాతన భారతీయ టీచింగ్స్‌ను మిలట్రీ శిక్షణ కరిక్యులమ్‌లో చేర్చాలని సిఫారసు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ తాజా వ్యాఖ్యలు చేసింది.

Updated Date - 2021-09-03T22:49:33+05:30 IST