పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్న సోనియా

ABN , First Publish Date - 2021-12-09T02:30:15+05:30 IST

పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్న సోనియా

పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్న సోనియా

న్యూఢిల్లీ: డిసెంబర్ 9న జరగాల్సిన తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణం మధ్య తాను పుట్టిన రోజు వేడుకలను జరుపుకోలేనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు. తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది మరణించినట్లు భారత వైమానిక దళం తెలిపింది.


Updated Date - 2021-12-09T02:30:15+05:30 IST