ప్రజల జేబుల్లోంచి బలవంతంగా డబ్బులు లాక్కొంటున్నారు : రాహుల్

ABN , First Publish Date - 2021-03-22T22:05:01+05:30 IST

పెట్రో ధరలను పెంచడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు.

ప్రజల జేబుల్లోంచి బలవంతంగా డబ్బులు లాక్కొంటున్నారు : రాహుల్

తిరువనంతపురం : పెట్రో ధరలను పెంచడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. పెట్రో ధరలు పెంచి, ప్రజల జేబుల్లోంచి బలవంతంగా డబ్బులు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నడపడానికే ఇదంతా చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా గాడి తప్పడానికి కేంద్రం అవలంబిస్తున్న  ధోరణులే కారణమని మండిపడ్డారు. సోమవారం రాహుల్ గాంధీ కేరళలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. ప్రజల చేతికి అధిక మొత్తంలో సొమ్మును బదిలీ చేయడమే ఏకైక మార్గమని అన్నారు. ఇలా ప్రజలకు భారీ మొత్తంలో సొమ్మును బదిలీ చేస్తే ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని తెలిపారు. ‘‘వినియోగం ప్రారంభించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించవచ్చని నమ్ముతున్నాం. ప్రజల చేతికి డబ్బులిస్తే కొనడం, అమ్మడం ప్రారంభమవుతుంది. జీఎస్టీ, నోట్లరద్దు ద్వారానే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇక కరోనా దానికి తోడైంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.’’ అని రాహుల్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కలేదు కాబట్టి ప్రభుత్వం వద్ద సొమ్ము లేదన్నారు. దీంతో ట్యాక్సులు రావడం లేదని, దీంతో పెట్రో ధరలు పెంచి, బలవంతంగా ప్రజల నుంచి లాక్కొంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. 

Updated Date - 2021-03-22T22:05:01+05:30 IST