జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి: ఆజాద్ డిమాండ్

ABN , First Publish Date - 2021-02-09T00:40:54+05:30 IST

కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు....

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి: ఆజాద్ డిమాండ్

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. ఇవాళ రాజ్యసభలో జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2021పై ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్‌ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కేడర్‌ అధికారులను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతం (ఏజీఎంయూటీ) కేడర్‌లో విలీనం చేసే ఈ బిల్లు ఇవాళ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. యూటీ హోదా వల్ల జమ్మూ కశ్మీర్‌కు మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతున్నదని ఆజాద్ అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఎక్కువ ప్రాంతం అడవులు, కొండలతో ఉన్నందున అక్కడ నివాసయోగ్యమైన భూములు చాలా తక్కువ అని ఆయన అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం కాగానే కొందరు అక్కడ స్థలాలు కొంటామంటూ చెబుతున్నారనీ.. కానీ శ్రీనగర్ వంటి నగరాల్లో ఎకరం భూమి రూ.40-50 కోట్లు పలుకుతున్నదన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్‌లో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని ఆజాద్ పేర్కొన్నారు. ఇక్కడికి కొత్తగా ఎలాంటి పరిశ్రమలూ రాకపోగా.. అస్థిర పరిస్థితుల వల్ల 60 శాతం పరిశ్రమలు మూతపడ్డాయని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2021-02-09T00:40:54+05:30 IST