ఉప ఎన్నికలో పుంజుకున్న కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-11-02T20:04:57+05:30 IST

ఇక కర్ణాటకలో ఒక అసెంబ్లీ స్థానం, మధ్యప్రదేశ్‌లో ఒక అసెంబ్లీ స్థానం, మహారాష్ట్రలో ఒక అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ మందంజలో ఉంది. ఇక బిహార్‌లో కాంగ్రెస్ మిత్ర పక్షం ఆర్జేడీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇక దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ..

ఉప ఎన్నికలో పుంజుకున్న కాంగ్రెస్

న్యూఢిల్లీ: తాజాగా దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకున్నట్లే కనిపిస్తోంది. మొత్తం 11 రాష్ట్రాల్లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు లోక్‌సభ నియోజకవర్గాలు జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల అవుతున్నాయి. కాగా, ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఆశాజనకంగా కనిపిస్తోంది. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ మిత్ర పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి. అధికారంలో ఉన్న రాజస్తాన్‌లోని రెండు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగ్గా రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. కాగా, బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా.. అన్నింటిలోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క స్థానంలోనూ ఆధిక్యం సాధించకపోవడం విశేషం.


ఇక కర్ణాటకలో ఒక అసెంబ్లీ స్థానం, మధ్యప్రదేశ్‌లో ఒక అసెంబ్లీ స్థానం, మహారాష్ట్రలో ఒక అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ మందంజలో ఉంది. ఇక బిహార్‌లో కాంగ్రెస్ మిత్ర పక్షం ఆర్జేడీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇక దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ మరో మిత్ర పక్షం శివసేన ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీ అంత గొప్పగా ప్రభావం చూపలేదు. ఇప్పటికే రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. మరో ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వీటితో పాటు ఒక లోక్‌సభ స్థానంలో బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తోంది.

Updated Date - 2021-11-02T20:04:57+05:30 IST