డిసెంబరులో కాంగ్రెస్‌ పాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-09T18:22:31+05:30 IST

కావేరి నదికి అనుబంధంగా కనకపుర తాలూకాలో నిర్మించదలిచిన మేకెదాటు ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్‌ పార్టీ పాదయాత్రకు సిద్ధమైంది. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సిద్దరామయ్య, డీకే

డిసెంబరులో కాంగ్రెస్‌ పాదయాత్ర

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసన

- ఇప్పుడు గుర్తుకొచ్చిందా: మంత్రి ఈశ్వరప్ప మండిపాటు 


బెంగళూరు: కావేరి నదికి అనుబంధంగా కనకపుర తాలూకాలో నిర్మించదలిచిన మేకెదాటు ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్‌ పార్టీ పాదయాత్రకు సిద్ధమైంది. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సిద్దరామయ్య, డీకే శివకుమార్‌, పరమేశ్వర్‌, ధృవనారాయణ, ఎస్‌ఆర్‌ పాటిల్‌ సహా పలువురు సుదీర్ఘంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు మొదటి వారంలో మేకెదాటు నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించారు. ఇద్దరు కీలక నేతలు సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ పాదయాత్రలో పాల్గొనేలా నిర్ణయించారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నా మేకెదాటు అమలులో జాప్యం చేస్తున్నారని, డీపీఆర్‌ పూర్తయి ఏళ్లు గడిచాయని కాంగ్రెస్‌ మండిపడింది. కర్ణాటకకు దక్కాల్సిన కావేరీ నీరు అన్యాయంగా సముద్రం పాలవుతోందని వెంటనే ప్రాజెక్టు నిర్మిస్తే బెంగళూరు నగరానికి సంపూర్ణంగా తాగునీరు సాధ్యమవుతుందన్నారు. బెంగళూరు, రామనగర, మండ్య, మైసూరు, హాసన్‌, చిక్కబళ్ళాపుర, తుమకూరు, కోలారు జిల్లాల ముఖ్యనేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాదయాత్రలో పాల్గొనేలా వ్యూహాలకు సిద్ధమయ్యారు. పాదయాత్ర ఎన్నిరోజులు కొనసాగించాలనేది ఖరారు చేయలేదు. అయితే వంద కిలోమీటర్లు పాదయాత్ర ఉండేలా తీర్మానించారు. కాగా పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఈశ్వరప్ప మాత్రం కాంగ్రెస్‌ నిర్ణయాన్ని ఎద్దేవా చేశారు. ఇంతకాలం లేనిది ఇప్పుడే మేకెదాటు గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. రెండేళ్లుగా మేకెదాటుపై నోరు తెరవలేదన్నారు. 

Updated Date - 2021-11-09T18:22:31+05:30 IST