ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

ABN , First Publish Date - 2021-06-22T05:24:00+05:30 IST

ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

న్యూఢిల్లీ: రోజు రోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణానికి నిరసన దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీనిపై ఈ నెల 24న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జిలు, జనరల్ సెక్రటరీలతో తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశం కానున్నారు. పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా...  ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశాలను ఆ పార్టీ నేతలు చర్చించనున్నారు.  గురువారం ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. 

Updated Date - 2021-06-22T05:24:00+05:30 IST