సర్టిఫికెట్ల తనిఖీని త్వరగా పూర్తిచేయండి

ABN , First Publish Date - 2021-08-20T07:28:16+05:30 IST

సర్టిఫికెట్ల తనిఖీకి సంబంధించి విద్యార్థుల నుంచి వచ్చే అభ్యర్థనలపై త్వరగా స్పందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ దేశంలోని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది.

సర్టిఫికెట్ల తనిఖీని త్వరగా పూర్తిచేయండి

విశ్వవిద్యాలయాలను ఆదేశించిన యూజీసీ

న్యూఢిల్లీ, ఆగస్టు 19: సర్టిఫికెట్ల తనిఖీకి సంబంధించి విద్యార్థుల నుంచి వచ్చే అభ్యర్థనలపై త్వరగా స్పందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌  దేశంలోని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. వెరిఫికేషన్‌ ప్రక్రియను నిర్దిష్ట సమయంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. డిగ్రీలు, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు వర్సిటీలు సర్టిఫికెట్లను జారీ చేస్తాయి. వాటి వ్యాలిడిటీని చెక్‌ చేసుకోవడానికి విద్యార్థులు యూజీసీని సంప్రదిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూజీసీ స్పందించింది.

Updated Date - 2021-08-20T07:28:16+05:30 IST