తేజస్ ఆలస్యానికి నష్టపరిహారం
ABN , First Publish Date - 2021-08-25T07:25:43+05:30 IST
తేజస్ ఎక్స్‌ప్రెస్ శని, ఆదివారాల్లో ఆలస్యంగా నడవడంపై రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీ సంస్థ తాజాగా స్పందించింది.

ప్రయాణికులకు మొత్తంగా రూ. 4 లక్షలు చెల్లింపు: ఐఆర్‌సీటీసీ
న్యూఢిల్లీ, ఆగస్టు 24: తేజస్ ఎక్స్‌ప్రెస్ శని, ఆదివారాల్లో ఆలస్యంగా నడవడంపై రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీ సంస్థ తాజాగా స్పందించింది. ఆ రెండు రోజులు ప్రభావితమైన 2035 మంది ప్రయాణికులకు రూ.4.5 లక్షల నష్టపరిహారాన్ని అందిస్తామని ప్రకటించింది. శనివారం భారీ వర్షాల వల్ల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద సిగ్నల్ విఫలం కావడంతో తేజస్ ఎక్స్‌ప్రెస్ రెండున్నర గంటల ఆలస్యంగా నడిచింది. ఆదివారం సైతం లఖ్‌నవూ-ఢిల్లీ తేజస్ రైలు గంట ఆలస్యంగా ప్రయాణించింది. దీంతో నిబంధనల ప్రకారం.. గంట ఆలస్యమైన ప్రయాణికులకు రూ.100, రెండు గంటలు లేదా ఆపై ఆలస్యమైన ప్రయాణికులకు రూ.250 అందనున్నాయి.