వర్షబాధిత ప్రాంతాల్లో మళ్ళీ Stalin పరిశీలన

ABN , First Publish Date - 2021-11-21T15:00:41+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మళ్ళీ వర్షబాధిత ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక మనలి పుదునగర్‌, మహాలక్ష్మి నగర్‌లో వర్షబాధిత ప్రాంతాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పూండి రిజర్వాయర్‌ నుంచి

వర్షబాధిత ప్రాంతాల్లో మళ్ళీ Stalin పరిశీలన

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మళ్ళీ వర్షబాధిత ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక మనలి పుదునగర్‌, మహాలక్ష్మి నగర్‌లో వర్షబాధిత ప్రాంతాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పూండి రిజర్వాయర్‌ నుంచి విడుదలైన అదనపు జలాలు రెండు రోజులుగా మనలి ప్రాంతాన్ని నీట ముంచాయి. మనలి సడయంకుప్పం, వడివుడైయమ్మన్‌ నగర్‌, జెనిఫర్‌ నగర్‌, మహాలక్ష్మినగర్‌ తదితర ప్రాంతాలలో వర్షపు నీరు వరదలా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మోకాలి లోతు నీరు ప్రవహిస్తున్న రహదారులలో నడిచివెళ్లి వర్షబాధితులను పరామర్శించారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రత్యేక శిబిరంలో బసచేస్తున్న వర్షబాధితులను పరామర్శించి వారికి సహాయాలు అందజేశారు. ఆయనతోపాటు మంత్రి పీకే శేఖర్‌బాబు, శాసనసభ్యుడు ఎస్‌. సుదర్శనం, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ, నగర పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ తదితరులు పర్యటించారు.

Updated Date - 2021-11-21T15:00:41+05:30 IST