‘సీఎం రిలీఫ్‌ ఫండ్‌’కు పొదుపు చేసిన నగదు

ABN , First Publish Date - 2021-05-21T14:13:40+05:30 IST

సేలం జిల్లా వాల్పాడి సమీపం ముత్తంపట్టికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కుమార్తె తాను దాచుకున్న నగదును ‘సీఎం రిలీఫ్‌ ఫండ్‌’కు అందజేసి తన ఉదారత...

‘సీఎం రిలీఫ్‌ ఫండ్‌’కు పొదుపు చేసిన నగదు

విద్యార్థినిని ప్రశంసించిన సీఎం స్టాలిన్‌

చెన్నై/పెరంబూర్: సేలం జిల్లా వాల్పాడి సమీపం ముత్తంపట్టికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కుమార్తె తాను దాచుకున్న నగదును ‘సీఎం రిలీఫ్‌ ఫండ్‌’కు అందజేసి తన ఉదారత నిరూపించుకుంది.. సెల్వకుమార్‌ కుమార్తె జెసికా (10) వాల్పాడి పంచాయతీ యూనియన్‌ ప్రాథమిక పాఠ శాలలో 10వ తరగతి చదువుతోంది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలకు విరాళాలు అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. దీంతో స్పందించిన జెసికా, తనకు లభించిన ఉపకారవేతనం రూ.1,500, పొదుపు చేసిన రూ.1,006 కలిపి మొత్తం రూ.2,506ను ‘సీఎం రిలీఫ్‌ ఫండ్‌’కు అందజేసింది. గురువారం సేలం జిల్లా పర్యటనకు వెళుతున్న ముఖ్య మంత్రికి జెసికా నగదును స్వయంగా అందజేసింది. తమకు సొంతిళ్లు, స్థలం లేకపోయినా కరోనా నివారణ నిధి విరాళం అందజేసిన జెసికాను సీఎం స్టాలిన్‌ అభినందించారు.

Updated Date - 2021-05-21T14:13:40+05:30 IST