పార్టీలోకి యువత రావాలి

ABN , First Publish Date - 2021-12-30T16:16:05+05:30 IST

ప్రజలకు సేవలందించే దిశగా యువత డీఎంకే పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. స్థానిక కొళత్తూర్‌ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని తిరువికనగర్‌ ప్రాంతంలో బుధవారం

పార్టీలోకి యువత రావాలి

                    - కొళత్తూర్‌ డీఎంకే సభలో సీఎం స్టాలిన్‌ పిలుపు


ప్యారీస్‌(చెన్నై): ప్రజలకు సేవలందించే దిశగా యువత డీఎంకే పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. స్థానిక కొళత్తూర్‌ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని తిరువికనగర్‌ ప్రాంతంలో బుధవారం ఏర్పాటు చేసిన మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. ఆయన పార్టీ శ్రేణులతో కలసి ఇంటింటికీ వెళ్లి డీఎంకే సభ్యత్వ దరఖాస్తులను పంపిణీ చేసి, పార్టీలో చేరాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డీఎంకే ఎంతగానో కృషి చేస్తోందని అన్నారు. పార్టీ పదవుల్లో ఉన్న నిర్వాహకులు పార్టీకి మరింత బలం చేకూర్చేలా సభ్యుల సంఖ్యను పెంచేందుకు సైనికుల్లా పాటుపడాలని, మహిళలు, యువతీయువకులు, విద్యార్థులను పెద్దసంఖ్యలో పార్టీలో చేర్పించేందుకు శ్రద్ధ చూపాలని స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2021-12-30T16:16:05+05:30 IST