అంబులెన్సుకు దారిచ్చిన Cm

ABN , First Publish Date - 2021-11-02T13:41:33+05:30 IST

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మరోమారు ప్రజల మన్ననలు పొందారు. తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కన నిలిపి తన వెనుక వస్తున్న అంబులెన్సుకు దారి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌

అంబులెన్సుకు దారిచ్చిన Cm

అడయార్‌(Chennai): ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మరోమారు ప్రజల మన్ననలు పొందారు. తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కన నిలిపి తన వెనుక వస్తున్న అంబులెన్సుకు దారి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో  సోషల్‌ మీడియా, టీవీల్లో వైరల్‌ కావడంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నగరంలో సోమవారం ఆయన కొత్తగా నిర్మించిన రెండు వంతెనలకు ప్రారంభోత్సవం చేశారు. ముందుగా వేళచ్చేరి విజయనగరం కూడలిలో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి సీఎం కాన్వాయ్‌ వెళ్తుండగా వేళచ్చేరి గురునానక్‌ కాలేజీ సమీపంలో అంబులెన్స్‌ రావడాన్ని ముఖ్యమంత్రి గమనించి, డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. ఆ వెంటనే సీఎం కాన్వాయ్‌ రోడ్డుకు ఒక వైపుకు వచ్చింది.. దీంతో అంబులెన్స్‌  వెళ్లిపోయింది. ఆ తర్వాత సీఎం కాన్వాయ్‌ యధావిధిగా ముందుకు సాగింది. ఈ దృశ్యాన్ని చూసిన వాహనచోదకులు, పాదాచారులు కొందరు తమ మొబైల్‌ఫోన్లలో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం వైరల్‌ అయింది. దీంతో నెటిజన్లు సీఎం స్టాలిన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - 2021-11-02T13:41:33+05:30 IST